
Free Wi-fi: ఉచిత వైఫై @ 6000 స్టేషన్స్
దిల్లీ: భారతీయ రైల్వే మరో మైలురాయి అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ సేవలు ఇప్పటి వరకు ఆరువేల స్టేషన్లకు విస్తరించాయి. ఝార్ఖండ్‌లోని హజీర్‌బాగ్ స్టేషన్లో శనివారం ఈ సేవలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఈ మైలురాయిని చేరుకుంది.
ఫ్రీ వైఫై సేవలు తొలిసారి 2016లో ముంబయి రైల్వేస్టేషన్లో ప్రారంభమయ్యాయి. అనంతరం దేశంలోని ప్రధాన స్టేషన్లకు ఈ సేవలను విస్తరించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ స్టేషన్ 5000వ స్టేషన్‌గా నిలిచింది. పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా అందరికీ ఈ సేవలు అందించడమే లక్ష్యమని రైల్వే తెలిపింది. గూగుల్, డీవోటీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా ట్రస్ట్ సహకారంతో రైల్వే శాఖకు చెందిన రైల్‌టెల్ వీటిని ఉచితంగా ఏర్పాటు చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.