భారత్‌కు రానున్న ఆఫ్రికా చిరుతలు!

దేశంలో ఆఫ్రికా చిరుతలు జీవించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అనుమతించింది..

Updated : 28 Jan 2020 18:13 IST

దిల్లీ: దేశంలో ఆఫ్రికా చిరుతలు జీవించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అనుమతించింది. అరుదైన భారతీయ చిరుతలు దాదాపుగా అంతరిస్తుండటంతో నమీబియా నుంచి ఆఫ్రికా చిరుతలను తీసుకొచ్చేందుకు అనుమతించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్టీసీఏ) సుప్రీం కోర్టును కోరింది. ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం, నమీబియా నుంచి ఆఫ్రికా చిరుతలను తీసుకురావడంలో మార్గనిర్దేశం చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆఫ్రికా చిరుతలను పెంచే ప్రదేశంపై ఈ కమిటీ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా, ఓ నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ తర్వాత కూడా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పిన ధర్మాసనం, ఆఫ్రికా చిరుతలు ఇక్కడ మనగలవని భావిస్తే వాటిని తరలించేందుకు ఎన్టీసీఏకు అనుమతి ఇస్తామని వెల్లడించింది. 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని