‘కొవిడ్‌’ను 40 ఏళ్ల ముందే ఊహించారా!?

చైనాలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 1700 మంది మరణించారు. వుహాన్‌లో వెలుగు....

Published : 18 Feb 2020 01:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 1700 మంది మరణించారు. వుహాన్‌లో వెలుగు చూసిన వైరస్‌ ఇప్పుడు దాదాపు 25 దేశాల్లో విస్తరించింది. అయితే, ఈ వైరస్‌ను 40 ఏళ్ల ముందే ఊహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

అమెరికాకు చెందిన రచయిత డీన్‌ కూంట్జ్‌ రచించిన ఐస్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ నవలలో ఈ వైరస్‌ ప్రస్తావన ఉంది. అయితే, కరోనా అని కాకుండా వుహాన్‌-400 అని అందులో పేర్కొన్నారు. ఓ లేబోరేటరీలో తయారైన ఓ జీవరసాయన ఆయుధంగా రచయిత తన కాల్పనిక (ఫిక్షన్‌) నవల్లో పేర్కొన్నారు. ఓ నెటిజన్‌ దీన్ని ట్విటర్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. అయితే, ఈ నవలలోని వైరస్‌ అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించారు. దీని కారణంగా వంద శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా ఆ స్థాయి ప్రమాదకారి కాదు. అంతేకాదు ఈ పుస్తకం తొలి విడత ఎడిషన్లలో వుహాన్‌-400 స్థానంలో, గోర్ఖి-400 అని ఉంది. వుహాన్‌ ప్రస్తావన ఉండడంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు కాకతాళీయమని కొట్టిపారేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని