రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై సీఎస్‌ సమీక్ష

తెలంగాణలో రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై శాఖల వారీగా మార్చి 4వ తేదీలోగా సాధారణ పరిపాలనా శాఖకు వివరాలు సమర్పించాలని

Published : 29 Feb 2020 18:48 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై శాఖల వారీగా మార్చి 4వ తేదీలోగా సాధారణ పరిపాలనా శాఖకు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ ఇవాళ సమావేశం నిర్వహించారు. శాసనసభ సమావేశాల సన్నద్ధత, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఆర్థికశాఖల పరిశీలనలకు అనుగుణంగా పోస్టుల వివరాలు ఇవ్వాలని సూచించారు. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం నివేదికలపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు. శాసనసభ సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమాధానాలు పంపించాలన్నారు. కాగ్‌ నివేదికలోని పెండింగ్‌ ఆడిట్‌ పేరాల సమాధానాల సమర్పణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బడ్జెట్‌ పద్దులు, ఔట్‌ కం బడ్జెట్‌లో సమగ్ర వివరాలు ఉండాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించి బ్రీఫ్‌ ప్రొఫైల్స్‌ ఉండాలని చెప్పారు. సోమేష్‌ కుమార్‌కు గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని