ఏపీ సీఎం ఆర్థిక సలహాదారుగా సుభాష్ చంద్ర

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్రగార్గ్ నియామకమయ్యారు. నిధుల సమీకరణలో సీఎం సలహాదారుగా గార్గ్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

Updated : 01 Mar 2020 23:49 IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్రగార్గ్ నియామకమయ్యారు. నిధుల సమీకరణలో సీఎం సలహాదారుగా గార్గ్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గతంలో సుభాష్ చంద్రగార్గ్‌ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. సుభాష్‌ గార్గ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. 
మరోవైపు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్ర బదిలీ అయ్యారు. ఆర్థిక వనరుల సమీకరణ ప్రత్యేక కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా నియామకమయ్యారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని