ఏప్రిల్‌ వేతనాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు.. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతాలు

Updated : 26 Apr 2020 18:22 IST

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు.. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాల కోత నుంచి ఈసారి పింఛనుదారులకు మినహాయింపు ఇచ్చింది. గత నెలలో వారికి 50 శాతం పింఛను మాత్రమే ఇవ్వగా ఈనెల 100శాతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవీ చదవండి..

జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌

అకాలవర్షంతో రైతులకు తీవ్ర నష్టం: పవన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని