విచక్షణతోనే నిర్ణయం తీసుకున్నా: రమేశ్‌కుమార్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తీసుకొనే నిర్ణయాలన్నీ ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

Published : 27 Apr 2020 13:42 IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తీసుకొనే నిర్ణయాలన్నీ ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు వ్యాజ్యంపై రిప్లై పిటిషన్‌ వేసిన ఆయన కమిషనర్‌ పనుల్లో  సాయం చేసేందుకే సెక్రటరీ విధులు పరిమితమని పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా గోప్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పిన ఆయన.. ఈసీ న్యాయవిభాగం వాయిదా నోటిఫికేషన్‌ తయారు చేశాకే తాను సంతకం చేశానని వివరించారు. విచక్షణతో వాయిదావేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఉంటుందని తెలిపారు. ఎస్‌ఈసీ నిర్ణయాలన్నీ ఈసీ ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదని రమేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు.  పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన తుది అఫిడవిట్‌పై హైకోర్టులో రేపు వాదనలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు