ప్రత్యేక రైళ్లలో ప్రసవాలు: ఇప్పటి వరకు ఎన్నంటే

శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటి వరకు 21 మంది శిశువులు జన్మించారని, వారందరికీ స్వాగతం అంటూ రైల్వే అధికారులు ప్రకటించారు.

Published : 22 May 2020 13:49 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రయణిస్తున్న పలువురు గర్భిణులు రైళ్లలోనే ప్రసవిస్తున్నారు. ఆ సమయంలో వారికి అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇలా రైళ్లలోనే ప్రసవించిన వారి వివరాలను తాజాగా రైల్వే శాఖ వెల్లడించింది.

ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటి వరకు 21 మంది శిశువులు జన్మించారని, వారందరికీ స్వాగతం అంటూ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రసవానికి సహాయం చేసిన రైల్వే సిబ్బంది, వైద్యులు.. అనంతరం తల్లీబిడ్డలను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారని అధికారులు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ వారిలో ముగ్గురు శిశువులు చనిపోయినట్లు వారు తెలిపారు. కాగా, శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు చిన్న పిల్లలు, గర్భిణీలు, వికలాంగులు, వృద్ధులకు ప్రాధాన్యం ఉంటుందని అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని