‘ఇది మీరిచ్చిన చివరి బహుమతి’

కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను అప్రమత్తం చేసిన చైనా వైద్యుడు లి వెన్లియాంగ్ భార్య ప్యూజుజీ శుక్రవారం  ఓ బిడ్డకు జన్మనిచ్చిందని అక్కడి మీడియా పేర్కొంది. 

Published : 13 Jun 2020 20:17 IST

- బిడ్డకు జన్మనిచ్చిన చైనా వైద్యుడి సతీమణి

బీజింగ్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను అప్రమత్తం చేసిన చైనా వైద్యుడు దివంగత లి వెన్లియాంగ్ భార్య ప్యూజుజీ శుక్రవారం  ఓ బిడ్డకు జన్మనిచ్చిందని అక్కడి మీడియా పేర్కొంది. 
 ‘మీరు నాకిచ్చిన చివరి బహుమతి ఈ రోజు జన్మించింది. ఈ బిడ్డను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటానని ’ ప్యూజుజీ విచాట్‌లో తెలిపినట్టు  మీడియా పేర్కొంది. 34 ఏళ్ల లీ వెన్లియాంగ్‌ చైనాలోని సెంట్రల్‌ ఆసుపత్రిలో నేత్రవైద్యుడు. డిసెంబర్‌ 30న తన ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించాడు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని తన స్నేహితులకు వీచాట్‌లో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్‌ అయ్యింది.   దీంతో వైరస్‌పై  పుకార్లు  రావడంతో  అక్కడి పోలీసు అధికారులు అతనిని అరెస్టు చేశారు. విడుదలైన తర్వాత ఆసుపత్రికి వెళ్లి తిరిగి పరీక్షలు ప్రారంభించాలనుకున్నారు.  అప్పటికే అతనికి కరోనా సోకడంతో జనవరి 12న  ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ ఫిబ్రవరిలో మృతిచెందాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని