హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని రమేశ్ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

Updated : 24 Jun 2020 15:13 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును  ప్రభుత్వం అమలు చేయట్లేదని పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. నిమ్మగడ్డ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎస్‌ఈసీగా రమేశ్‌ కుమార్‌ను పునఃనియమించాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని