ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా

నారాయణపేట పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి కరోనా సోకింది. రెండ్రోజుల కిందట పట్టణానికి చెందిన ఆర్‌ఎంపీకి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రైమరీ కాంటాక్టు కింద 17 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వారిలో 9 మందికి కరోనా పాజిటివ్‌

Published : 11 Jul 2020 07:13 IST

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 కేసులు


కొత్తకోట : రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌ : నారాయణపేట పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి కరోనా సోకింది. రెండ్రోజుల కిందట పట్టణానికి చెందిన ఆర్‌ఎంపీకి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రైమరీ కాంటాక్టు కింద 17 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వారిలో 9 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరితో కలిపి ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం మొత్తం 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8 మంది, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు, జోగులాంబ గద్వాలలో ఒకరు చొప్పున కరోనా బారిన పడ్డారు. మహబూబ్‌నగర్‌ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. టీబీ ఆసుపత్రిలో పనిచేసే సూపర్‌వైజర్‌కు కొవిడ్‌ నిర్ధరణ అయింది. రవీంద్రనగర్‌లో ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. టీడీగుట్టకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. జిల్లా కేంద్రం శివారులోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో పీజీ విద్యార్థి కరోనా బారిన పడ్డాడు. దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లికి చెందిన యువకుడికి కరోనా వచ్చింది. జడ్చర్లలోని లక్ష్మీనగర్‌కాలనీకి చెందిన ఓ యువకుడు కొవిడ్‌ బారిన పడ్డాడు. గద్వాలలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో ఓ కిరాణా వ్యాపారికి వైరస్‌ సోకింది. నాగర్‌కర్నూల్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు. ఆయన నమూనాల పరీక్షల ఫలితాలు రాగా.. అందులో పాజిటివ్‌ అని తేలింది. ఆయన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొనడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొల్లాపూర్‌లో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి భార్యకు కరోనా సోకింది. బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లికి చెందిన ఓ పోలీసు ఉద్యోగికి కరోనా వచ్చింది. ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఇప్పటి వరకు పాలమూరు జిల్లాల్లో 367 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అందులో 25 మంది మృతి చెందారు.


ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఇలా..

జిల్లా మొత్తం మృతులు

మహబూబ్‌నగర్‌ 164 09

నాగర్‌కర్నూల్‌ 47 06

జోగులాంబ గద్వాల 70 04

నారాయణపేట 32 04

వనపర్తి 63 02

మొత్తం 376 25


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని