Batukamma song: మన మిట్టపల్లిదే ‘అల్లిపూల వెన్నెల’

పల్లె పాటలతో ఆయన ప్రస్థానం మొదలైంది. జానపదాలు, సామాజిక చైతన్య గీతికలు, సినిమా గీతాలు.. ఇలా అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ

Updated : 06 Oct 2021 09:38 IST

సురేందర్‌

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: పల్లె పాటలతో ఆయన ప్రస్థానం మొదలైంది. జానపదాలు, సామాజిక చైతన్య గీతికలు, సినిమా గీతాలు.. ఇలా అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మిట్టపల్లి సురేందర్‌. ఈయన రాసిన ‘అల్లిపూల వెన్నెల’ పాటకు ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించగా దర్శకుడు గౌతం మీనన్‌ దర్శకత్వం వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ పాట మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లికి చెందిన మిట్టపల్లి సురేందర్‌ ఏటా ఎన్నో జానపదాలు, బతుకమ్మ, సినిమా పాటలు రాస్తున్నారు. ఈసారి పండుగకు రాసే అవకాశం మిట్టపల్లికి దక్కింది. ‘అల్లిపూల వెన్నెల చెరువలోన కురవగా.. పూల ఇంద్ర ధనస్సులే నేల మీద నిలవగా.. కొమ్మలన్నీ అమ్మలై వేలపూలు విరియగా..’ అంటూ అద్భుతమైన పదాలతో గౌరమ్మ పాటను అల్లారు మిట్టపల్లి. ‘ఎన్నో బతుకమ్మ పాటలు రాసినా ఏఆర్‌.రెహమాన్‌, గౌతం మీనన్‌ లాంటి ప్రముఖులతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని మిట్టపల్లి సురేందర్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని