Updated : 08/12/2021 08:25 IST

TS News: పుట్టుక నాది... బతుకంతా మీది: తెరాస ఎంపీ సంతోష్‌

- జన్మదినం సందర్భంగా సీఎంతో ఉన్న ఫొటోతో సంతోష్‌ ట్వీట్‌

ఈనాడు, హైదరాబాద్‌: పుట్టినరోజు సందర్భంగా తెరాస రాజ్యసభ సభ్యుడు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు మంగళవారం ప్రగతిభవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి, విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది’ అని పేర్కొంటూ చిన్నతనంలో తనను కేసీఆర్‌ భుజాలపై ఎత్తుకుని ఉన్న పాత ఫోటోను సంతోష్‌ ట్విటర్‌లో జత చేశారు. జన్మదినం సందర్భంగా ఆయన ఉప్పల్‌ భగాయత్‌లో మొక్కలు నాటారు. దిల్లీలో పలువురు ఎంపీలు కూడా సంతోష్‌ పేరిట మొక్కలను నాటారు. నాంపల్లి దర్గాలో ఆయన పేరిట మైనారిటీ నేతలు ప్రార్థనలు చేసి చాదర్‌ను సమర్పించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని