AP Sachivalayam employees: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌

శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated : 17 Apr 2023 19:49 IST

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్‌ వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పే స్కేలులో మార్పు.. 

గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులకు రూ.22,120 - రూ.74,770పే స్కేలును అమలు చేయనున్నారు. డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, గ్రేడ్‌-2 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, సెరికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ సర్వేయర్, వీఆర్వో, వెల్ఫేర్‌ అసిస్టెంట్ల వేతన శ్రేణి రూ.22,460 - రూ.72,810 మధ్య ఉండనుంది. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీకి ఉద్యోగులకు రూ.23,120 - రూ.74,770 వేతనం చెల్లించగా.. మిగిలిన వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌-డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలకు పే స్కేలు రూ. 22,460- రూ.72,810 మధ్య ఉండనుంది.

రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మే 1 నుంచి అమలయ్యే వేతనాలు ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు