Prakash Raj: మౌనంగా ఉంటే దేశానికి తగిలిన గాయాలు మానవు: ప్రకాశ్‌రాజ్‌

మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచ పుండు అవుతాయని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం’ను ఆవిష్కరించిన అనంతరం ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు.

Updated : 12 Aug 2023 17:43 IST

హైదరాబాద్‌: మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండు అవుతాయని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం’ను ఆవిష్కరించిన అనంతరం ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు.

‘‘కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారు. ప్రస్తుత సమాజం సందిగ్ధతలో ఉంది. వంద రోజులుగా మణిపుర్ మండిపోతుంది. మణిపుర్ గురించి ప్రశ్నిస్తే హరియాణా, బెంగాల్.. అని అనవసర విషయాలు ప్రస్తావించారు.  గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కులం, మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి’’ అని ప్రకాశ్‌రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని