Vijayawada: కట్టనూ లేరు.. కట్టినవి ఇవ్వనూ లేరు!

ఈ చిత్రాలను చూస్తే... తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలపై వైకాపా ప్రభుత్వం పగబట్టినట్లుగా కనిపిస్తోంది. తెదేపా హయాంలో దాదాపుగా పూర్తయిన టిడ్కో గృహాలను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు.

Updated : 05 Mar 2024 07:22 IST

ఈనాడు, అమరావతి - భవానీపురం, న్యూస్‌టుడే

జక్కంపూడిలో తెదేపా హయాంలోనే నిర్మాణాలు పూర్తి చేసి రంగులు వేసి సిద్ధం చేసిన టిడ్కో గృహాలు (పాతచిత్రం)

చిత్రాలను చూస్తే... తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలపై వైకాపా ప్రభుత్వం పగబట్టినట్లుగా కనిపిస్తోంది. తెదేపా హయాంలో దాదాపుగా పూర్తయిన టిడ్కో గృహాలను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. విజయవాడ నగరానికి సమీపంలో జక్కంపూడి, షాబాద, వేమవరంలో ఆరు వేల గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిలో చాలా వరకు గృహాలు 90 శాతం పనులు తెదేపా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. రంగులు కూడా వేసి సిద్ధం చేశారు. అయితే... వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ గృహాలను పూర్తిగా మరుగున పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైకాపా రంగులు వేశారు. వాటిని పూర్తి స్థాయిలో వేయకుండా సగంలోనే వదిలేశారు. అలాగే మౌలిక వసతులను సైతం కల్పించలేదు. రహదారులు, తాగునీరు, భూగర్భ డ్రెయినేజీ, విద్యుత్తు సౌకర్యం కల్పించాల్సి ఉంది. నేటికీ ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. గృహాల వద్ద పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. ఇప్పటికే ఆయా గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు. కానీ... ప్రతికూల పరిస్థితులు వీడి... తాము ఎప్పుడు గృహ ప్రవేశాలు చేస్తామా అని పేదలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అవే గృహాలు కొన్నింటికి వైకాపా రంగులు వేసినా.. లబ్ధిదారులకు ఇవ్వని దయనీయం

భవంతుల చుట్టూ  పెరిగిన పిచ్చి మొక్కలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని