Ginger: అల్లంతో ప్రయోజనాలు ఎన్నో!

వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

Published : 16 Oct 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అబ్బా.. తలనొప్పిగా ఉంది. కాస్త అల్లం టీ  దొరికితే బాగుండు’ అనే మాట చాలాసార్లు వినే ఉంటాం. అవునండీ అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి. 

  • ఔషధ గుణాలున్న అల్లాన్ని హోమియోపతిలో కూడా ఉపయోగిస్తారు. వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
  • కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్లు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది.
  • కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • అల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 
  • కిడ్నీ సమస్యలతో బాధపడేవారు.. నీటిలో అల్లం వేసి మరిగించి, కాస్త నిమ్మ రసం కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి. 
  • బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది.
  • ఉదయం లేవగానే నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఈ నీళ్లను వడగట్టి తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగండి. 
  • రోజూ వండే కూరల్లో కచ్చితంగా అల్లం చేర్చుకోండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని