ఉద్యోగం వదులుకో.. లక్ష డాలర్లు ఇస్తా!
సాధారణంగా డబ్బుల సంపాదించడం కోసం యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. వీడియోలు చేస్తుంటారు. కానీ, ఓ యువకుడు యూట్యూబ్ వీడియో చేయడం కోసమే రూ. కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ప్రజల్లో తిరుగుతూ వారికి చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చి.. గెలిచివారికి డాలర్ల కొద్ది డబ్బుల్ని బహుమతిగా ఇచ్చేస్తున్నాడు. అమెరికాకు
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా డబ్బులు సంపాదించడం కోసం చాలామంది యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. వీడియోలు చేస్తుంటారు. కానీ, ఓ యువకుడు యూట్యూబ్ వీడియో చేయడం కోసమే రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ప్రజల్లో తిరుగుతూ వారికి చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చి.. గెలిచిన వారికి డాలర్ల కొద్ది డబ్బుల్ని బహుమతిగా ఇచ్చేస్తున్నాడు. అమెరికాకు చెందిన 22 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్‌సన్‌కు మిస్టర్ బీస్ట్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీంతో మిస్టర్ బీస్ట్‌గానే అతడు నెటిజన్లకు సుపరిచితం. అతడి ఛానెల్‌కు దాదాపు ఐదున్నర కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అతడు చేసే ప్రతీ వీడియోలోనూ భారీగా ఖర్చు కనిపిస్తుంటుంది. అందుకే అతడి ఫాలోవర్స్ అంతా కొత్త వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాడా?ఎంత డబ్బు ఖర్చు చేస్తాడా? అని ఎదురుచూస్తుంటారు.
ఇటీవల జిమ్మీ తన ఛానెల్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. అందులో ఒక రెస్టారెంట్‌లో పనిచేసే మహిళను ఉద్యోగం వదులుకుంటే లక్ష డాలర్లు (సుమారు రూ.73లక్షలు)ఇస్తానని చెప్పాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా.. వచ్చిన ఆఫర్‌ను కాదనలేక ఆమె ఉద్యోగం వదులుకుంది. దీంతో జిమ్మి ఆమెకు కొంత డబ్బును చేతికిచ్చాడు. అలాగే వాల్‌మార్ట్‌లో పనిచేసే మరో చిరుద్యోగికి పది వేల డాలర్లు అందజేశాడు. అందమైన భవంతి తాళం చెవిని కొన్ని వేరే తాళం చెవులలో కలిపేసి.. ఇంటి అసలు తాళంచెవి కనిపెడితే ఆ భవంతిని సొంతం చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. ఓ వ్యక్తి అసలు తాళంచెవి కనిపెట్టి ఇంటిని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, రోడ్డుపై తన కారును తనే పంక్చర్ చేసుకొని రహదారిపై వెళ్లే వాహనదారుల్ని సాయం అడిగాడు. ఓ వ్యక్తి టైరు మార్చడంలో సాయం చేయడంతో ఆ కారును అతడికే అప్పగించాడు. మానవత్వం చాటినందుకు ఈ బహుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇలాంటి ఎన్నో టాస్క్‌లను నిర్వహిస్తూ విజేతలకు నగదును బహుమతిగా ఇస్తున్నాడు. జిమ్మీ చేసే వీడియోల్లో కనిపించే భారీతనం వ్యూస్‌లోనూ ఉంటుందండోయ్.. అతడి చేసే ఒక్కో వీడియోను కోట్లాది మంది వీక్షిస్తుంటారు. మరి జిమ్మీ చేసిన తాజా వీడియోను మీరూ చూసేయండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
DGP Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ
-
Assembly election Results: మూడు రాష్ట్రాల ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా..!
-
Chhattisgarh Election Results: ఛత్తీస్‌గఢ్‌లో మోదీ మ్యాజిక్‌తో భాజపా జోరు
-
Telangana Election Results: తెలంగాణ ‘హస్త’గతం ఇలా..!
-
Assembly Election Results: మూడు రాష్ట్రాల్లో భాజపా జోరు.. ట్వీట్ చేసిన మోదీ
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా