Haryana: ప్రింటింగ్‌ ప్రెస్‌ ఓనర్‌.. కొవిడ్‌ తర్వాత.. రోడ్డుపై వంటకాలతో వ్యాపారం!

కరోనా కాలంలో వ్యాపారం దెబ్బతినటంతో కొత్తగా ఆలోచించారు ఈ జంట. కేవలం రెండు వంటకాలతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 

Published : 01 Apr 2023 01:18 IST

ఫరిదాబాద్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా (Covid 19) వైరస్‌ మహమ్మారి.. ఎన్నో జీవితాలను నాశనం చేసింది. చిన్న వ్యాపారస్థులు మొదలు భారీ సంస్థలు కూడా కుదేలయ్యాయి. కోట్ల మంది ఉపాధిపై ఇది ప్రభావం చూపింది. ఇలా వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయినా ఓ జంట మాత్రం అధైర్యపడలేదు. మంచి ఆలోచనతో కలిసి ముందుకు సాగింది. హరియాణా (Haryana)లోని ఫరిదాబాద్‌కు చెందిన  భార్యభర్తలు రోడ్డుపై ఫుడ్‌ స్టాల్‌ ఏర్పాటు చేసి కేవలం రెండు వంటకాలతోనే దాన్ని నడుపుతున్నారు. వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

‘గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ను(printing press) నడిపాను. కరోనా కాలంలో అది నడవక పోవడంతో ఇళ్లు గడవటం కష్టమైంది. కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. ఇంట్లో ఖర్చు ఎక్కువ కావటంతో అవి సరిపోయేవి కావు. దీంతో నా భార్యా నేను కలిసి సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాం. గ్రీన్ చట్నీ, కధీ చావల్, రాజ్మా చావల్‌ చేయటం తెలుసు. దీన్నే వ్యాపారంగా ప్రారంభించాలనుకున్నాం. ఒక్కో వంటకాన్ని రూ. 40లకు అమ్ముతున్నాను’అని వ్యాపారి వీడియోలో తెలిపారు. దీన్ని ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. ఎంతో మంది వీరిపై ప్రశంసల జల్లు కురిపించారు.  ఇది కదరా బంధమంటే అని ఒకరు.. మీకు ఇవే నా సెల్యూట్‌ అని మరొకరు కామెంట్‌ చేశారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో చాలా డబ్బు సంపాదించండని ఇంకొకరు కామెంట్‌ చేశారు. ఐడియా అదిరింది అంటూ నెటిజన్లు రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని