Telangana News: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పాతబస్తీ చార్మినార్, చంద్రాయణగుట్ట, బార్కస్, గోల్కొండ, కార్వాన్‌, లంగర్‌ హౌస్‌,

Updated : 01 Jul 2022 22:57 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పాతబస్తీ చార్మినార్, చంద్రాయణగుట్ట, బార్కస్, గోల్కొండ, కార్వాన్‌, లంగర్‌ హౌస్‌, బహదూర్‌పురా, సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, బేగంపేట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, లక్డీకాపూల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వానహదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వరదనీరు నిల్వకుండా బల్దియా సిబ్బంది చర్యలు చేపట్టారు. వరదనీరు చేరే ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని