Ts News: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్‌ పట్టణంలోని గీతా

Updated : 11 Jan 2022 19:29 IST

కరీంనగర్‌‌: తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్‌ పట్టణంలోని గీతా భవన్‌ సెంటర్‌లో ఉన్న హోర్డింగ్‌ కూలిపోయింది. రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన భారీ కటౌట్‌ కూలిపోయింది. గాలుల ధాటికి విద్యుత్‌ దీపాల అలంకరణ లుమినార్‌ నేలకొరిగింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా సుమారు రూ.45 లక్షలు పెట్టి ఈ భారీ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సరిసిల్ల జిల్లాలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ స్థాయిలో గాలులు వీయడంతో సిరిసిల్ల విద్యానగర్‌లో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని