Breast cancer: రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేదెలా తెలుసుకోండి

రొమ్ము క్యాన్సర్‌ ఆధునిక మహిళలను అంతులేని భయానికి గురి చేస్తోంది. బ్రెస్టులో ఏ కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్‌ అనే భయం చాలా మందిని వెంటాడుతోంది.

Published : 07 Jul 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రొమ్ము క్యాన్సర్‌ ఆధునిక మహిళలను అంతులేని భయానికి గురి చేస్తోంది. బ్రెస్టులో ఏ కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్‌ అనే భయం చాలా మందిని వెంటాడుతోంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్‌ కాదు. నడి వయసు దాటాక రొమ్ముల్లో మార్పులను గమనించడం, ఏటా మామోగ్రామ్‌ చేయించుకుంటే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

* రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి అత్యాధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మామోగ్రామ్‌ పరీక్షతో క్యాన్సర్‌ ఆనవాళ్లను తొలిదశలోనే పసిగట్టవచ్చు.

* చూసేందుకు ఇది గడ్డలాగానే ఉంటుంది. ఎక్స్‌రే కిరణాలను ప్రసరింపజేయడంతో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. 

* 40 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయిస్తే రొమ్ముల్లో ఇబ్బందులను తెలుసుకోవచ్చు. ఏవైనా అనుమానం ఉంటే చికిత్సతో తొందరగా కోలుకోగలుగుతారు.

* స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌ను మహిళలు, వైద్యులు క్యాన్సర్‌ను గుర్తించలేనప్పుడు వైద్యులు ఈ పరీక్ష సిఫారసు చేస్తారు.

* సర్వెలెన్సు పరీక్షను క్యాన్సర్‌ వచ్చి చికిత్స తీసుకున్నపుడు రొమ్ము తొలగించని వారికి చేస్తారు.  ఏడాదికోసారి ఈ పరీక్ష చేయించుకుంటే రెండో రొమ్ముకు క్యాన్సర్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. 

* రొమ్ములో కణితి, కొత్తగా వచ్చిన మార్పులు గమనించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్థారించడానికి డయాగ్నస్టిక్‌ మామోగ్రామ్‌ చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని