New Course: రోజుకో గంట కేటాయించండి...! నచ్చిన కోర్సు నేర్చుకోండి!

ప్రస్తుతం యువత ఒకే పనికి, లేదా ఒకే వృత్తికి పరిమితం కావడం లేదు. ఒకే సమయంలో ఆయా రంగాల్లో పని చేస్తున్నారు. ఒక చోట ఉద్యోగం చేస్తూనే, మరో చోట అవకాశం వస్తే ఫ్రిలాన్సర్‌గా పనిచేస్తున్నారు. ఇలా చేయాలనే ఆశ ఉన్నవాళ్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరికొందరు వివిధ రకాల పనులు నేర్చుకోవాలనే అభిరుచిని కలిగి ఉంటారు.

Published : 25 Sep 2022 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృతి జీవితంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ తమని తాము అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయాలనే ఆశ ఉన్నవాళ్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ సమయం లేదనో, ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది తమ  ఇష్టాలను వదిలేసుకుంటున్నారు. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మార్గం లేదని నిరుత్సాహపడకూడదు. ఆ పని పూర్తి చేసుకునేందుకు వేరే మార్గాన్ని ఎంచుకోవాలి. నచ్చిన పనిని నేర్చుకునేందుకు ఎలాంటి విషయాలు పాటించాలో తెలుసుకోండి. 

* ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నచ్చిన పనిని నేర్చుకోండి.

* ఏ పని నేర్చుకోవాలన్నా ఆన్‌లైన్‌లో ఆ పనికి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

* ముందుగా మీరు నేర్చుకోవాలనుకున్న కోర్సును ఆన్‌లైన్‌లో వెతకండి. ఇందులో మోసకరమైన వెబ్‌సైట్‌లు కూడా ఉంటాయి. వీటిల్లో నమ్మకమైన వెబ్‌సైట్‌ను గుర్తించి, మీకు నచ్చిన కోర్సులో చేరండి. గడువు పూర్తయ్యే వరకు వాళ్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా నేర్చుకోండి. దీంతో మీకు నచ్చిన పనిని సులువుగా నేర్చుకోవచ్చు. 

* పట్టుదలగా నేర్చుకోవాలి. చాలామంది కోర్సులో జాయిన్‌ అయ్యే ముందు చూపిన ఆసక్తి ఆ తర్వాత చూపించరు. అలా చేయకూడదు. పని మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తయ్యేవరకు ఏకాగ్రతతో నేర్చుకోవాలి. 

* చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు రోజుకో గంట సమయం నచ్చిన పని నేర్చుకోవటం కోసం కేటాయించాలి. కుట్లు అల్లికలు, శాస్త్రీయ నృత్యాలు, సంగీత వాయిద్యాలు వాయించడం వంటి కోర్సులు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 

*  నేర్చుకున్న పనిని మర్చిపోకుండా ఉండేందుకు తరగతులు పూర్తయ్యాక ఆ పాఠాలను అభ్యాసం చేయండి. ఇలా చేయడం ద్వారా పనిలో మరింత నైపుణ్యాలను పొందగలుగుతారు.

* ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. దీంతో ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని