
అది మెడికల్ వేస్ట్ కాదు: గాంధీ ఆర్‌ఎంవో
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో పోగైన వ్యర్థాలు మెడికల్ వేస్ట్ కాదని గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంవో రఘుకిరణ్ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలపై పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ) జూన్ 30న సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జూలై 28వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు నేడు గాంధీ ఆర్‌ఎంవో విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. గాంధీలో పేరుకుపోయిన వ్యర్థాలు మెడికల్ వేస్ట్ కాదని, సాధారణ చెత్త అని తెలిపారు. ప్రస్తుతం వాటిని తొలగించినట్లు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.