sukhibhava Joke: వద్దమ్మా.. ఆ లింక్స్‌ను క్లిక్‌ చేయొద్దు..!

: గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా జపం చేస్తున్న పదం ‘‘ సుఖీభవ.. సుఖీభవ.’’ ఏ మీమ్‌ చూసినా, ఏ మండపం దగ్గర డీజే విన్నా..

Published : 26 Sep 2021 01:41 IST

అలాంటి లింక్స్‌ ఓపెన్‌ చేయకండంటూ హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా జపం చేస్తున్న పదం ‘‘సుఖీభవ.. సుఖీభవ.’’ ఏ మీమ్‌ చూసినా, ఏ మండపం దగ్గర డీజే విన్నా.. ఇదే మాట అందరి నోట వినిపిస్తుంది. ఓ ‘టీ’ యాడ్‌లో బామ్మ ఒకరికి టీ ఇచ్చినందుకు గానూ ఆశీర్వదిస్తూ చెప్పే మాటే ‘సుఖీభవ’. కట్‌ చేస్తే ఆ టీ పొడి యాడ్‌ను రీక్రీయేట్‌ చేశారు. గణేశ్‌ నిమజ్జనం రోజు ‘‘అయ్యోయ్యో.. వద్దమ్మా సుఖీభవ! సుఖీభవ!’’ అంటూ చిందులేయడం కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి దీని మీద లెక్కలేనన్ని మీమ్స్‌, వీడియోస్‌ పుట్టుకొచ్చాయి. ఇదే కోవలో సైబర్‌ మోసాలకు పాల్పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుఖీభవ స్టైల్‌లో హెచ్చరిస్తూ హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఈ మీమ్‌ను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్‌ వైరల్‌గా మారింది. ఇటీవలే అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయొద్దని తెలంగాణ పోలీస్‌- సైబర్‌ క్రైమ్‌ అవగాహన కల్పిస్తూ సాధారణంగా ట్వీట్‌ చేసినప్పటికీ ఇదే విషయాన్ని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ టీమ్‌ ‘సుఖీభవ’తో వైరల్‌ అయ్యేలా చేసింది. ఇక నెట్టింట్లో నవ్వులు పూయించిన సుఖీభవ జోక్స్‌ మీకోసం!




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని