TSRTC: హైదరాబాద్‌-విజయవాడ ఈ-గరుడ బస్సులను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో ఈ-గరుడ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ సజ్జనార్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Updated : 16 May 2023 21:03 IST

హైదరాబాద్‌: వాయు కాలుష్యాన్ని నివారించే ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను టీఎస్‌ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ప్రారంభించింది. హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో పరుగులు పెట్టనున్న ‘ఈ-గరుడ’ బస్సులను మియాపూర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని పుష్పక్‌ బస్‌ పాయింట్‌ వద్ద రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ సజ్జనార్‌ జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ఇవాళ పది బస్సులను ప్రారంభించగా.. దశలవారీగా 50 ఎలక్ట్రిక్‌ బస్సులను  నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మిగతా బస్సులను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చేలా సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఇవి వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ చెబుతోంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఈ-గరుడ ఛార్జి రూ.780గా నిర్ణయించారు. హైదరాబాద్‌లో త్వరలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రారంభిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని