Telangana News: ఉద్యోగ నియామకాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు: సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో ఉద్యోగ నియామకాలకు 95శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం...

Published : 19 Feb 2022 19:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో ఉద్యోగ నియామకాలకు 95శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం... ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వరకు 95శాతం స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. అదే తరహాలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లోనూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టి ఈనెల 23 వరకు సాధాన పరిపాలనశాఖకు నివేదిక పంపాలని సీఎస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని