JNTU Hyderabad: రాకెట్‌ రూపకల్పనలో నేనూ తప్పులు చేశా: ఇస్రో ఛైర్మన్‌

అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు.

Updated : 05 Jan 2024 14:12 IST

హైదరాబాద్‌: అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు. తెలంగాణలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను వీసీ ప్రొ.కట్టా నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించా. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నాం. చంద్రయాన్‌ - 3 దేశం మొత్తం గర్వించేలా చేసింది. పరాజయాలు అధిగమించి 3 ప్రాజెక్టుల్లో విజయం సాధించాం. నా జీవితంలో రాకెట్‌ రూపకల్పనలో నేనూ ఎన్నో తప్పులు చేశా. అపజయం గెలుపునకు పాఠం లాంటింది’’ అని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు