Justice NV Ramana: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యత కాదు: జస్టిస్‌ ఎన్వీ రమణ

వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యత కాదని.. సమాజంలో నెలకొన్న అసమానతలను...

Updated : 24 Sep 2022 14:01 IST

హైదరాబాద్‌: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యత కాదని.. సమాజంలో నెలకొన్న అసమానతలను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వ్యాపారం చేసేవారు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2022కు జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ.. 20 ఏళ్లలో ప్రపంచంలోనే గొప్ప సంస్థగా ఎదిగిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని