Offbeat: వరకట్నంగా తాబేలు.. వరుడి కుటుంబం వింత కోరిక!

ఎవరైనా పెళ్లిలో కారు, బైక్‌ లాంటివి కట్నంగా అడుగుతారు. కాని మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కట్నంగా 21 గోళ్లున్న తాబేలు

Published : 23 Jul 2021 01:26 IST

ముంబయి: ఎవరైనా పెళ్లిలో కారు, బైక్‌ లాంటివి కట్నంగా అడుగుతారు. లేదంటే పొలం, ఇల్లు రాసివ్వమంటారు. కానీ మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ కుటుంబం మాత్రం వింత కోరిక కోరింది. కట్నంగా 21 గోళ్లున్న తాబేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఇంతకీ ఈ తాబేలు కథ ఏంటో.. చివరికి ఏమైందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 

ఈ ఏడాది ఫిబ్రవరి 10న రామానగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఓ మహిళతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి ముందు వధువు కుటుంబం, వరుడి కుటుంబానికి ₹2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం వరకట్నంగా ఇచ్చారు. అయితే నిశ్చితార్థం తర్వాత వరుడి కుటుంబ సభ్యులు మరింత కట్నం కోసం డిమాండ్‌ చేశారు. అందులో భాగంగా 21 గోళ్లున్న తాబేలు, నల్ల లాబ్రడార్‌ శునకం, బుద్ధ విగ్రహం, ఒక దీపపు కుందె, మరో పది లక్షల రూపాయలు వరకట్నంగా ఇవ్వాలని అడిగారు. అవి ఇస్తే పెళ్లయిన తర్వాత వధువుకు ఉద్యోగం వస్తుందని నమ్మబలికారు. అందుకు వధువు కుటుంబం అంగీకరించలేదు. డిమాండ్లను నెరవేర్చలేదన్న కారణంతో వరుడి కుటుంబం వివాహాన్ని నిలిపివేసింది. దాంతో వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించారు. వధువు కుటుంబాన్ని నమ్మించి మోసం చేసినందుకుగానూ వరుడి కుటుంబంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని