NEET Exam 2023: దేశవ్యాప్తంగా ముగిసిన నీట్‌ పరీక్ష

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష దేశవ్యాప్తంగా ముగిసింది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.

Published : 07 May 2023 18:46 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 40వేల మంది పరీక్షకు హాజరైనట్టు సమాచారం. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌,. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

పరీక్షా కేంద్రాల వద్ద మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేసి విద్యార్థులను లోపలికి పంపించారు. ఎవరైనా విద్యార్థులు లోహాలతో తయారు చేసిన ఉంగరాలు, ముక్కుపుడకలు ధరించి వస్తే.. వాటిని తొలగించి లోపలికి అనుమతించారు. కొన్ని కేంద్రాల్లో నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులనూ సిబ్బంది అనుమతించ లేదు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు