OMC: మైనింగ్‌ కొనసాగింపునకు ఏపీ అంగీకరిస్తే సరిపోదు: సుప్రీంకోర్టు

మైనింగ్‌ కొనసాగింపునకు ఏపీ అంగీకారం తెలిపితే సరిపోదని, కర్ణాటక అనుమతి కూడా తప్పనిసరి అని ఓఎంసీ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 10 Jan 2023 16:35 IST

దిల్లీ: ఓఎంసీ కార్యకలాపాలపై పిటిషన్లను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గ్రీన్‌ బెంచ్‌కు బదిలీ చేసింది. మైనింగ్‌ కొనసాగింపుపై సుప్రీంకోర్టు గ్రీన్‌ బెంచ్‌ విచారణ చేయనుంది.  ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ తవ్వకాల్లో హద్దులు చెరిపిన అంశం పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. భూగర్భ తవ్వకాలు ఎక్కడి వరకు వెళ్తాయో చెప్పలేమంటూ ఆస్ట్రేలియా భూగర్భ మైనింగ్‌ వ్యవహారాన్ని ప్రస్తావించింది. మైనింగ్‌ కొనసాగింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపితే సరిపోదని, కర్ణాటక అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరిహద్దు వివాదంతో సంబంధం లేదని ఓంఎసీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ప్రస్తుతం ఏపీలోనే మైనింగ్‌ జరుగుతుందని, కర్ణాటకలో అభ్యంతరాలు ఏమీ లేవన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కర్ణాటకలో మైనింగ్‌ మొత్తం పూర్తయిందా? అని ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని