ఏపీ ఎస్‌ఈసీ నియామకంపై విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో

Published : 21 Jun 2021 16:45 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఈసీ నీలం సాహ్ని నియమాకాన్ని సవాల్‌ చేస్తూ డాక్టర్‌ శైలజ హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. నీలం సాహ్నిని రాజ్యాంగ విరుద్ధంగా నియమించారని పిటిషనర్‌ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల ఖర్చు రూ.160కోట్లు రికవరీ చేయాలని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు.

సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోకుండా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రసాద్‌బాబు కోర్టులో వాదించారు. ఎన్నికల షెడ్యూల్‌కు నెల రోజుల సమయం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించిందన్నారు. ఆ తీర్పును అర్థం చేసుకోకుండా రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడంతో  రూ.160 కోట్లు ప్రజా ధనం వృథా అయిందని.. దీన్ని ఎవరి నుంచి రాబట్టాలని ప్రశ్నించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని