తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

రానున్న ఐదు రోజలపాటు తెలంగాణ (Telangana) లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) వెల్లడించింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు, సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Published : 23 Mar 2023 16:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ(Telangana) లో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Centre) వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు  పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదై.. సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని