Samatha Murthy: ముగింపు దశకు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు

నగర శివారు ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. వేడుకల్లో చివరి రోజైన ఇవాళ.. యాగశాలలోని సహస్ర

Updated : 14 Feb 2022 17:10 IST

హైదరాబాద్‌: నగర శివారు ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. వేడుకల్లో చివరి రోజైన ఇవాళ.. యాగశాలలోని సహస్ర కుండాల శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు. వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో చినజీయర్ స్వామి లక్ష్మీనారాయణ మహాయాగాన్ని ముగించారు. యాగంలో వినియోగించిన 1,035 పాలికులతో యాత్రగా సమతామూర్తి స్వర్ణ ప్రతిమ వద్దకు చేరుకొని వైభవంగా ప్రాణప్రతిష్ఠాపన చేశారు. స్వర్ణమూర్తికి అభిషేకం, తొలి ఆరాధన నిర్వహించారు. స్వర్ణమూర్తి ప్రతిష్ఠాపన ముగియడంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఉన్న రుత్వికులు, భక్తులు.. శ్రీమన్నారాయణ తిరుమంత్రాన్ని ఆలపిస్తూ ఆనందతాండవం చేశారు. యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మరోవైపు సమతామూర్తి వేడుకలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహస్రాబ్ది ముగింపు వేడుకల్లో పాల్గొని 108 ఆలయాల్లో శాంతి కల్యాణాన్ని వీక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని