సాగునీటి ప్రాజెక్టులపై ముగిసిన సీఎం సమీక్ష

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఏపీ ముఖ్యమంత్రి  జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.రాష్ట్రంలోని పోలవరం,వెలిగొండ, అవుకు టన్నెల్‌-2 పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.

Updated : 12 Nov 2020 00:19 IST


అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.రాష్ట్రంలోని పోలవరం,వెలిగొండ, అవుకు టన్నెల్‌-2 పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్‌్స‌‌, కాలువల పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు సీఎంకు వివరించారు. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తవుతుందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు అప్రోచ్‌, స్పిల్‌ ఛానెల్‌ పనులు మే నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అంతకు ముందే కాఫర్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేయాలని సూచించారు.

విశాఖ తాగునీటి అవసరాలను తీర్చేలా పోలవరం నుంచి ప్రత్యేక పైపులైన్‌ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పంపింగ్‌ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. తద్వారా విద్యుత్తు వినియోగం లేకుండా చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో నీరు 41.15 అడుగులకు చేరినా బ్యాక్‌ వాటర్‌తో సమస్యలు రాకూడదని సీఎం అధికారులకు వివరించారు. అంతేకాకుండా సమస్యలు లేకుండా భూసేకరణ, ఆర్‌అండ్‌ ఆర్‌ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిర్వాసితులకు సైతం ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులపైనా సీఎం సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని