Sabitha Indra Reddy: గవర్నర్‌ సందేహాలు నివృత్తి చేస్తాం: మంత్రి సబిత

విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు అంశంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 

Updated : 09 Nov 2022 16:20 IST

హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు అంశంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు విషయంలో కొన్ని సందేహాలు లేవనెత్తుతూ రాజ్ భవన్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ వచ్చిందని సబిత పేర్కొన్నారు. దీనిపై రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి సందేహాలను నివృత్తి చేయాలని ప్రభుత్వం నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఇప్పటికే గవర్నర్‌ సమయం కోరామని.. ఆమె సమయం ఇచ్చిన వెంటనే వెళ్లి కలుస్తామన్నారు. బిల్లుకు సంబంధించి న్యాయపరమైన సందేహాలు సహా ఇతరత్రా అన్ని అంశాలపై గవర్నర్‌కు వివరణ ఇస్తామని మంత్రి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని