Lockdown: పలు రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీలేని కారణంగా జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను  వెల్లడించింది.

Published : 31 May 2021 14:10 IST

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీలేని కారణంగా జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను  వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది. 
రద్దు చేసిన రైళ్ల వివరాలు:  
1. గూడూరు-విజయవాడ, 2.విజయవాడ-గూడూరు, 3.గుంటూరు-వికారాబాద్, 4. వికారాబాద్-గుంటూరు, 5. విజయవాడ-సికింద్రాబాద్, 6. సికింద్రాబాద్-విజయవాడ, 7. బీదర్-హైదరాబాద్, 8. సికింద్రాబాద్-బీదర్, 9.హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌ నగర్, 10. సిర్పూర్‌ కాగజ్ నగర్ -సికింద్రాబాద్, 11. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 12. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్, 13. సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్ నగర్, 14. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్, 15. నర్సాపూర్-నిడుదవోలు, 16.నిడుదవోలు-నర్సాపూర్, 17. గుంటూరు-కాచిగూడ, 18.కాచిగూడ-గుంటూరు, 19. ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్, 20. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్, 21. పర్బని-హెచ్.ఎస్.నాందేడ్, 22. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి, 23.విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్,  24. తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్‌ మధ్య నడిచే రైళ్లను జూన్ 1నుంచి 16 వరకు రద్దు చేస్తున్నామని రైల్వేశాఖ తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని