
హెల్మెట్ పెట్టను.. చలానే కడతా..
సైబరాబాద్: ప్రతిచోటా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లే.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూడా ఓ కస్టమర్ ఉన్నాడు. క్రమంతప్పకుండా చలానాలు కడతానంటున్నాడు.. కానీ శిరస్త్రాణం ధరించనని మారాం చేస్తున్నాడు. హెల్మెట్ లేకుండా తిరిగినందుకు ఇప్పటివరకు దాదాపు రూ.వెయ్యి చలానాలు కట్టాడు. ఈ జరిమానాలు కూడా ఎప్పటికప్పుడే కట్టేస్తున్నాడు. ఈ విచిత్ర వాహనదారుడి వైఖరిని గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరదాగా ఓ మీమ్ తయారు చేశారు. ఏరోజుకారోజు జరిమానా కట్టకపోతే.. ఆ హెల్మెట్ ఏదో పెట్టుకోవచ్చుగా అంటూ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ వాహనదారుడి వైఖరిపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.