ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి:సీఎం

వ్యవసేయత ఆస్తులు కలిగి ఉన్నవారికి మెరూన్‌ కలర్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌లు ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో అధికారులతో సీఎం పలు అంశాలపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..

Updated : 24 Sep 2022 15:19 IST

హైదరాబాద్‌: వ్యవసేయత ఆస్తులు కలిగి ఉన్నవారికి మెరూన్‌ కలర్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌లు ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో అధికారులతో సీఎం పలు అంశాలపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లు ఇవ్వనున్నట్లు  తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలు ఆశించే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. భూవివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించేందుకు ఈ పాస్‌బుక్‌ ఉపయోగపడుతుందన్నారు. ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం పాస్‌ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీఎం సూచించారు. ప్రతి ఇంటికీ నంబర్‌ కేటాయించి పన్ను వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. నాలా బదలాయింపు చేయాలని అధికారులకు సూచించారు. మార్పులు చేర్పుల్లో భాగంగా ధరణి పోర్టల్‌ కాస్త ఆలస్యమైన పర్వాలేదన్నారు. ధరణి పోర్టల్‌ ప్రారంభమైన తర్వాతే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు. దేవాదాయ, వక్ఫ్‌, ఎఫ్‌టీఎల్‌, నాలా, యూఎల్‌సీ పరిధిలో ఇళ్లకు మ్యుటేషన్‌ వర్తించదన్నారు. భవిష్యత్తులో ఆస్తుల నమోదు, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా కన్వర్షన్‌ ఉండదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్లు తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రజలకు సమాచారం సులుభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని