Anand Mahindra: వారాంతంలో జ్ఞాపకాల లైబ్రరీకి వెళ్లిన మహీంద్రా..!
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో స్పందించారంటే.. కచ్చితంగా ఏదో కొత్త విషయం మనకు తెలిసినట్లే! లేకపోతే మన పెదాలు చిరునవ్వులైనా చిందిస్తాయి!
ముంబయి: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో స్పందించారంటే.. కచ్చితంగా ఏదో కొత్త విషయం మనకు తెలిసినట్లే! లేకపోతే మన పెదాలు చిరునవ్వులైనా చిందిస్తాయి! అయితే ఈసారి మహీంద్రా తన వ్యక్తిగత విషయాన్ని వెల్లడించారు. తన యవ్వనంలో గడిపిన జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. ఆ విషయాలను వెల్లడిస్తూ.. టీనేజ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వారాంతాల్లో ఎలా గడిపేవాడినో మరోసారి గుర్తుచేసుకుంటున్నాను. 1972లో నా వయస్సు 17 సంవత్సరాలు. అప్పుడు నా స్నేహితుడితో కలిసి తరచూ ముంబయి నుంచి పుణె వరకు ట్రక్కుల్లో ప్రయాణించేవాడిని’ అంటూ లాంగ్‌డ్రైవ్‌లో ఉన్న మజాను మహీంద్రా వెల్లడించారు. అలా విహరిస్తూ అప్పుడే విడుదలైన సినిమాలోని పాటలు పాడుకునేవాళ్లమని చెప్పుకొచ్చారు. మహీంద్రా పెట్టిన ఈ పోస్టు ఎంతో మందిని మెప్పించింది. ట్రక్కు పైన కూర్చొని.. ఆకాశాన్ని చూస్తూ.. పక్కనే ఉన్న మన స్నేహితులతో వంకలు తిరిగే రోడ్డుపై ప్రయాణిస్తూ పాటలు పాడుకోవడం ఒక వరమంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కచ్చితంగా అంటూ ఆనంద్ సమాధానమిచ్చారు. మీకూ ఇలాంటి జ్ఞాపకాలున్నాయా..? ఈ వారాంతంలో ఓసారి మీ జ్ఞాపకాల లైబ్రరీకి వెళ్లి, రిఫ్రెష్ అవ్వండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్‌రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్‌పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM