సీబీఐ అనవసరంగా ఇరికించింది: మంత్రి సబితా

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇందూటెక్‌ జోన్‌ ఛార్జిషీట్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్‌ జోన్‌ ఛార్జి షీట్‌ నుంచి తన పేరు తొలగించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published : 14 Jul 2021 18:06 IST

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇందూటెక్‌ జోన్‌ ఛార్జిషీట్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్‌ జోన్‌ ఛార్జి షీట్‌ నుంచి తన పేరు తొలగించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ అనవసరంగా ఈకేసులో తనను ఇరికించిందని కోర్టుకు తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పార్థసారధిరావు డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలుకు సమయం కోరారు. డిశ్ఛార్జి పిటిషన్‌ వేసే ఉద్దేశం లేదని ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇందూటెక్‌ జోన్‌ ఛార్జి షీట్‌పై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఎమ్మార్‌ విల్లాల విక్రయంపై సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. 

సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గడువు కోరారు. సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనతో సీబీఐ కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి డిశ్ఛార్జి పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. కఠిన చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఉత్తర్వులను శ్రీలక్ష్మి .. సీబీఐ కోర్టుకు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని