Viveka Murder Case: నేడు మేజిస్ట్రేట్‌ ముందుకు వివేకా మాజీ డ్రైవర్‌!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 81వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి..

Updated : 26 Aug 2021 12:30 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 81వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి హాజరయ్యారు. కాగా, దస్తగిరిని ఇవాళ జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెక్షన్‌ 164 కింద దస్తగిరి వాంగ్మూలం నమోదు చేస్తారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి వివేకా ఇంటికి వాచ్‌మెన్‌గా పని చేసిన రంగయ్య వాంగ్మూలాన్ని ఇటీవల జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ వద్ద నమోదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని