
AP News: జ్యుడీషియల్ ప్రివ్యూకి జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం
అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం రీసర్వే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూ (న్యాయపరమైన ముందస్తు సమీక్ష)కి పంపింది. రీసర్వే ప్రాజెక్టులో డ్రోన్ సేవలు, లార్జ్ సైజు మ్యాపింగ్ సేవల కోసం ఆసక్తిదారుల నుంచి తీసుకునేందుకు వీలుగా ఆర్ఎఫ్పీ, టెండర్ ప్రతిపాదనల్ని న్యాయసమీక్షకు పంపించింది. రీసర్వే ప్రాజెక్టులోని భాగస్వాములు, ప్రజలు, ఆసక్తిదారులు జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తికి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు, ఫిర్యాదులు పంపాలని ప్రభుత్వం కోరింది. డిసెంబరు 9వ తేదీలోగా దీనికి సంబంధించిన అభ్యంతరాలను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌కు పంపించాలని సర్వేసెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డుల కమిషనర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.