AP News: మోపాడు రిజర్వాయర్‌కు లీకులు.. 5 గ్రామాలకు ముప్పు! 

ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్‌ కట్ట కింది భాగంలో లీకవుతోంది. దీంతో 5గ్రామాలకు ముప్పు పొంచి ఉంది.

Updated : 01 Dec 2021 16:55 IST

పామూరు: ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్‌ కట్ట కింది భాగంలో లీకవుతోంది. దీంతో 5గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. దీనికి తోడు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

కాగా, ఈ ఉదయం నుంచి రిజర్వాయర్‌ కట్టకు అడుగు భాగంలో ఐదు చోట్ల నీరు లీకవుతోంది. గమనించిన స్థానికులు, రైతులు వెంటనే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ రిజర్వాయర్‌ కింద సుమారు 20వేల ఎకరాలు సాగవుతున్నాయి. నీరు లీకవుతుండటంతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

మరోవైపు జిల్లాలోని పామూరు పాత చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో జేసీ వెంకటమురళి, అధికారులు చర్యలు చేపట్టారు. అలుగు పారుతున్న నీరు 565 జాతీయ రహదారిపైకి వచ్చి గోపాలపురం ఎస్సీకాలనీని ముంచేసింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని