AP News: ఏసీసీఎంసీని వ్యతిరేకిస్తూ మరో గ్రామం ఏకగ్రీవ తీర్మానం

అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏసీసీఎంసీ) ఏర్పాటును మరో గ్రామం వ్యతిరేకించింది.

Updated : 06 Jan 2022 12:51 IST

అమరావతి: అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏసీసీఎంసీ) ఏర్పాటును మరో గ్రామం వ్యతిరేకించింది. నిన్న మంగళగిరి మండలం కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలు ఏసీసీఎంసీకి వ్యతిరేకంగా గ్రామసభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ లింగాయపాలెం గ్రామస్థులు కూడా కార్పొరేషన్‌ ఏర్పాటును వ్యతిరేకించారు. 29 గ్రామాలతోనే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

తూళ్లూరు ఎంపీడీవో శ్రీనివాసులు, పంచాయతీరాజ్‌ ఈవో ఆధ్వర్యంలో లింగాయపాలెంలో గ్రామసభ నిర్వహించగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం లింగాయపాలెం గ్రామస్థులు కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా తూళ్లూరు ఎంపీడీవో మాట్లాడుతూ 19గ్రామాల అమరావతి కార్పొరేషన్‌ ప్రతిపాదనను గ్రామస్థులు వ్యతిరేకించారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని