Tallest living woman: ప్రపంచంలోనే ఎత్తైన మహిళ ఎవరో తెలుసా..?

టర్కీకి చెందిన రుమీసా గెల్గి(24) ప్రపంచంలోనే జీవించిఉన్న ఎత్తైన మహిళగా రికార్డు సృష్టించారు. 215.16 సెంటీమీటర్ల (7 అడుగుల 0.7 అంగుళాలు)తో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. గెల్గి ఈ ఘతన సాధించడం ఇది రెండోసారి. 2014లో 18 ఏళ్ల వయసులో ప్రపంచంలో జీవించి ఉన్న ఎత్తైన టీనేజర్‌గా రికార్డు నెలకొల్పారు. 

Published : 15 Oct 2021 01:37 IST

రికార్డు ఎత్తు పెరిగి రెండు ఘనతలు సొంతం చేసుకున్న టర్కీ మహిళ

అంకారా: టర్కీకి చెందిన రుమీసా గెల్గి(24) ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా రికార్డు సృష్టించారు. 215.16 సెంటీమీటర్ల (7 అడుగుల 0.7 అంగుళాలు)తో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. గెల్గి ఈ ఘతన సాధించడం ఇది రెండోసారి. 2014లో 18 ఏళ్ల వయసులో ప్రపంచంలో జీవించి ఉన్న ఎత్తైన టీనేజర్‌గా రికార్డు నెలకొల్పారు. 

అరుదైన రికార్డులు రుమీసా గెల్గి సొంతం చేసుకోవడం వెనుక కారణం.. ఆమెకున్న అరుదైన వ్యాధి. ఆమె వీవర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఇది పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అయితే అనారోగ్యంతో ఆమె ఎక్కువ శాతం చక్రాల కుర్చీలోనే గడపాల్సి వస్తోంది. అయితే వాకర్ సాయంతో కొద్ది దూరం నడవగలదు. 

గెల్గి మాట్లాడిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు విడుదల చేసింది. ‘నేను పుట్టుకతోనే స్కోలియోసిస్ వ్యాధి బారినపడ్డాను. దాంతో శారీరక వైకల్యం ఏర్పడింది. ఎక్కువగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి ఉంటుంది. వాకర్‌ సాయంతో మాత్రమే నడవగలను. ఈ వ్యాధి వల్ల చిన్నప్పుడు వేధింపులు ఎదుర్కొన్నాను. నా కుటుంబం మాత్రం ఎంతో అండగా నిలబడింది’ అని తన పరిస్థితి గురించి వెల్లడించారు. టర్కీలో ఈ తరహా కేసు ఇదే మొదటిది కావొచ్చని ఆమె అన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన  గిన్నిస్ సంస్థ ఇలా రాసుకొచ్చింది..‘ భిన్నంగా ఉండటం అంత చెడ్డదేం కాదు. మీరు ఇంతకు ముందు ఎన్నడూ ఊహించని వాటిని సాధించేలా చేస్తుంది’ అంటూ ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుందనే అర్థంలో వ్యాఖ్యను జోడించింది. ఈ పోస్టుకు నెట్టింట్లో విపరీతమైన మద్దతు దక్కింది. 

మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలో జీవించి ఉన్న ఎత్తైన వ్యక్తిది కూడా టర్కీనే. ఆయన పేరు సుల్తాన్ కొసెన్‌. ఎత్తు 8 అడుగుల పైనే. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా హైపోథాలమస్ ప్రభావితమవడంతో ఆయన రికార్డు ఎత్తు పెరిగారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని