AP News: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం: జగన్‌

ఏపీలోని కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేసే ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభమైంది.

Updated : 05 Oct 2021 13:51 IST

అమరావతి: ఏపీలోని కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేసే ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలోని 10 లక్షల మందికి పైగా కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు అందజేయనున్నాం. వినియోగించిన న్యాప్‌కిన్లను డిస్పోజ్‌ చేసే పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. నోడల్‌ అధికారి ద్వారా కిశోర బాలికలకు అవగాహన కల్పించనున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇన్సినరేటర్లు కూడా ఏర్పాటయ్యాయి’’అని జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్‌కిన్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని