HYD: భారతీయ వారసత్వాన్ని కాపాడుకోవాలి: వెంకయ్య

నగరంలోని జలవిహార్‌లో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ ఉత్సవం సందడిగా జరిగింది. హరియాణా గవర్నర్‌ బండారు

Updated : 17 Oct 2021 13:16 IST

హైదరాబాద్‌: నగరంలోని జలవిహార్‌లో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ ఉత్సవం సందడిగా జరిగింది. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసైతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. కుల, మత, భాష, ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేదే అలయ్‌ బలయ్‌ ఉత్సవ సందేశం అని చెప్పారు. మన సాంప్రదాయాలు, ఆచారాలు, ప్రాచీన భారతీయ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని వివరించారు. బతుకమ్మ, బోనాల తెలంగాణ సంస్కృతులను ప్రతిబింబిస్తాయని వెంకయ్య చెప్పారు. 

కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై మాట్లాడారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నామన్నారు. అలయ్‌ బలయ్‌ సంబురాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. 16 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందని ఆమె తెలిపారు. అలయ్‌ బలయ్‌.. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయలక్ష్మి విజయవంతంగా కొనసాగించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

16 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవం జరపడం సంతోషమని.. ప్రతిఒక్కరూ అలయ్‌ బలయ్‌ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు జరగాలని తాను కోరుకుంటానని తెలిపారు. తమ ఆహ్వానం మన్నించి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అత్యున్నత స్థానంలో ఉన్నవారి నుంచి చిన్న ఉద్యోగి వరకు ఒకే వేదికను పంచుకునే కార్యక్రమమే అలయ్‌ బలయ్‌ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని