AP News: సత్యసాయిబాబా సేవలు అందరికీ ఆదర్శనీయం: రాష్ట్రపతి ముర్ము

శ్రీసత్యసాయిబాబా 98వ జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.

Published : 22 Nov 2023 19:21 IST

పుట్టపర్తి: మానవసేవే మాధవసేవ అని బోధించిన శ్రీసత్యసాయి సేవలు అందరికీ ఆదర్శనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీ సత్యసాయిబాబా 98వ జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి హాజరయ్యారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ రత్నాకర్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. సదా సత్యం పలకాలని, సదా ధర్మాన్ని ఆచరించాలన్న బాబా వాక్కులను నిజజీవితంలో అలవరుచుకొని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన శ్రీసత్యసాయి బాబా విద్యాసంస్థల విద్యార్థులకు పట్టాలతో పాటు 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని